NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పీఎం కిసాన్ పథకంలో కొత్త రూల్స్.. అలా చేయకపోతే డబ్బులు రావు

1 min read


పల్లెవెలుగు వెబ్: రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. అందులో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. ప్రతి ఏడాది రూ. 6వేలును విడుతల వారీగా రైతుల ఖాతాలో నేరుగా కేంద్రం నగదును జమ చేస్తుంది. అయితే ఈ పథకంలో పలు మార్పులు చేసింది. తాజాగా మారిన నిబంధనల ప్రకారం పొలం ఎవరి పేరు మీద ఉంటుందో ఆ రైతులు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ పథకం ప్రయోజనాలు వర్తిస్తాయి. అంటే పూర్వీకుల భూమిలో భాగస్వామ్యం ఉన్నవారు ఇకపై పీఎం కిసాన్ ప్రయోజనాలు పొందలేరు. ఎవరి పేరు మీద అయితే పొలం ఉంటుందో వారు కొన్ని పథకానికి సంబంధించి కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ పథకం కింద కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు.. తాజాగా దరఖాస్తు ఫారంలో తమ భూమి సర్వే నంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే కొత్త నిబంధనలు పాత లబ్ధిదారులపై ప్రభావం ఉండదు. కొత్త నిబంధనల ప్రకారం సర్వే వివరాలను ఆన్‏లైన్లో ఇంట్లో కూర్చోని కూడా ఎవరి వారు చేసుకోవచ్చు. లేదా పంచాయతీ కార్యదర్శి లేదా స్థానిక కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం
పీఎం కిసాన్ అధికారిక వెబ్‎సైట్‏కు లాగిన్ కావాలి
ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయాలి.
న్యూఫార్మర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి.
ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.
క్యాప్చా కోడ్ నమోదు చేసి..మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.
అనంతరం మీరు మీ పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత బ్యాంకు అకౌంట్ వివరాలు.. పొలానికి సంబంధించిన సమాచారాన్ని ఎంటర్ చేయాలి. చివరగా సబ్మిట్ చేయాలి.

About Author