నిమ్మకాయల గ్రేడింగ్ మిషన్ నూతన ప్రారంభం..
1 min read– నిమ్మ ఉత్పత్తుల ఎగుమతిలో దెందులూరు మార్కెట్ కమిటీ ప్రధమ స్థానం
– టెక్నాలజీ మిషన్ల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించవచ్చు
– ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : నాణ్యమైన నిమ్మ ఉత్పత్తులను అధునాతన టెక్నాలజీ మిషన్ ల ద్వారా గ్రేడింగ్ చేయడం ద్వారా నిమ్మ రైతులు తగిన గిట్టుబాటు ధర పొందవచ్చని దెందులూరు శాసన సభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఉన్న దెందులూరు మార్కెట్ యార్డ్ లో రైతుల సౌకర్యార్థం మార్కెట్ కమిటీ కొనుగోలు చేసిన నిమ్మకాయల గ్రేడింగ్ మిషన్ ను ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిమ్మ ఉత్పత్తుల ఎగుమతిలో దెందులూరు మార్కెట్ కమిటీ ప్రధమ స్థానంలో ఉందన్నారు. దెందులూరు నియోజకవర్గ పరిధి రైతులకు మార్కెట్ కమిటీ మెరుగైన సేవాలందిస్తుందని తెలిపారు. రానున్న రోజులలో దెందులూరు మార్కెట్ కమిటీలో రైతుల ఉత్పత్తుల నిల్వలకు కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు కూడా చేయనున్నామని తెలిపారు. మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు మరిన్ని మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషిచేస్తానని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదవేగి ఎంపిపి తాతా రమ్య, జడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ మేకా లక్ష్మణరావు, పెదవేగి సోసిటీ చైర్ పర్సన్ పెనుమాక వెంకట సుబ్బారావు, పెదవేగి మండల సచివాలయాల కన్వీనర్ కేసిన సతీష్, డి సి సి బి డైరెక్టర్ తాతా సత్యనారాయణ, కొనకళ్ల వెంకన్న, వివిధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.