NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎయిడ్స్ క‌ట్ట‌డికి కొత్త వ్యాక్సిన్ !?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎయిడ్స్‌ వ్యాధిని ఇంజక్షన్‌తో జయించే రోజులు రాబోతున్నాయి. ఇజ్రాయెల్‌కు శాస్త్రవేత్తల బృందం జన్యువుల ఎడిటింగ్‌ విధానాన్ని ఉపయోగించి హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌ను కట్టడి చేసే కొత్త వ్యాక్సిన్‌ను కనుగొంది. టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీకి చెందిన న్యూరో బయోలజీ, బయో కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్‌ శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనలు నిర్వహించి ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది. ప‌రిశోధన వివరాలను నేచర్‌ జర్నల్‌ ప్రచురించింది. ఈ వ్యాక్సిన్‌ ద్వారా శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీస్‌ అత్యంత సమర్థంగా ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. ఒక్క డోసు వ్యాక్సిన్‌తో హెచ్‌ఐవీ రోగుల్లో వైరస్‌ను తటస్థీకరించేలా చేయడంలో శాస్త్రవేత్తలు తొలి దశలో విజయం సాధించారు. ఈ ఇంజెక్షన్‌తో వైరస్‌ నిర్వీర్యం కావడంతో పాటు రోగుల ఆరోగ్యమూ బాగా మెరుగవుతోంది. ఇంజనీరింగ్‌–టైప్‌ బీ తెల్ల రక్తకణాల ద్వారా రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచి హెచ్‌ఐవీ వైరస్‌ను న్యూట్రలైజ్‌ చేసే యాంటీ బాడీలు ఉత్పత్తయేలా ఈ వ్యాక్సిన్‌ పని చేస్తుంది.

                                             

About Author