PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ్రాన్స్ లో కొత్త వేరియంట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యూర‌ప్ దేశాల్లో అధికంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ తో పాటు కొత్త వేరియంట్ వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఫ్రాన్స్ అంటువ్యాధుల ప‌రిశోధ‌న కేంద్రం నిపుణులు వెల్ల‌డించారు. ఈ వేరియంట్ ను IHU ర‌కంగా శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు. ఇందులో దాదాపు 46 మ్యుటేష‌న్లు జ‌రిగిన‌ట్టు వెల్ల‌డించారు. ఈ వేరియంట్ కు సంబంధించి ప్రాన్స్ లోని మార్సిల్లెస్ న‌గ‌రంలో ఇప్పటికే 12 కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. ఆఫ్రికాలోని కామెరూన్ నుంచి వ‌చ్చిన ప్ర‌యాణీకుల్లో ఈ వేరియంట్ బ‌య‌ట‌ప‌డిన‌ట్టు అక్క‌డి అధికారులు భావిస్తున్నారు.

                                               

About Author