కొత్త వేరియంట్.. భారత్ అప్రమత్తం !
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన వైరస్ కొత్త వేరియంట్ ఆందోళనకు గురిచేస్తోంది. దక్షిణాఫ్రికాలో భయటపడ్డ బి.1.1. 529 వేరియంట్ నుంచి ముప్పు తప్పదని వైద్య నిపుణులు భావిస్తున్నారు. దీనిలోని అధిక మ్యుటేషన్ల కారణంగా మునుపటి వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. లక్షణాలు కూడ తీవ్రంగా ఉంటాయన్న వార్తలు ప్రపంచ దేశాల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న హెచ్ఐవీ పేషెంట్ నుంచి ఈ వేరియంట్ ఉత్పన్నమై ఉంటుందని లండన్ లోని యూసీఎల్ జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్ చెందిన ఓ శాస్త్రవేత్త తెలిపారు. ఈ కొత్త వేరియంట్ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు విధించాయి. పలు దేశాలు నాలుగు ఆఫ్రికా దేశాల నంచి విమానాల రాకపోకలను నిలిపివేశాయి. భారత్ కూడ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
ReplyForward |