కొత్త ఓటర్లూ.. మీ పేరు ఇలా నమోదు చేసుకోండి
1 min read
పల్లెవెలుగువెబ్ : కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఎస్ఆర్)-2023 ప్రారంభమైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా ప్రకటించారు. 2023 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండుతున్నవారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. వీరితోపాటు 2023 ఏప్రిల్ 1, మే 1, జూలై 1, అక్టోబరు 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండేవారు కూడా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు.