న్యూఇయర్ వేడుకలు.. ముంబై అలర్ట్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : న‌్యూఇయర్ -2022 వేడుకల సందర్భంగా దేశ వాణిజ్య రాజధాని ముంబైలో అలర్ట్ ప్రకటించారు. ముంబైలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖలీస్థానీ తీవ్రవాదులు దాడులకు పాల్పడవచ్చేనే నిఘావర్గాల సమాచారం అందడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబై, బాంద్రా, దాదర్, చర్చ్‌గేట్, కుర్ల తదితర స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులకు సెలవులు రద్దు చేశారు. 3వేల మంది పోలీసులను ప్రధాన స్టేషన్ల వద్ద మోహరిస్తామని ముంబై రైల్వే పోలీస్ కమిషనర్ ఖలిద్ తెలిపారు.