కొత్త సంవత్సరం.. కొత్త జీఎస్టీ రూల్స్ !
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్రప్రభుత్వం కొత్త జీఎస్టీ నిబంధనలు తీసుకొచ్చింది. పన్నుల చెల్లింపులో మోసపూరిత కార్యకలాపాలు అరికట్టడం కోసం చట్టంలో కొన్ని సవరణలు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ నిబంధనలు జనవరి 1, 2022 నుంచి వర్తిస్తాయి. ఈ సవరణలు పరోక్ష పన్ను విధానాన్ని మరింత కఠినతరం చేయనున్నాయి. ఈ మార్పులు పన్ను పరిధిలోకి వచ్చే ట్యాక్సబుల్ సప్లై, ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లకు అర్హత, కొన్ని నిర్దిష్ట సందర్భాలలో అప్పీళ్లను దాఖలు చేసే నిబంధనలు వంటి అనేక సమస్యలను కవర్ చేస్తాయి. ఈ కొత్త సవరణలు వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేనప్పటికీ, వ్యాపారాలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయనుంది.