NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

17లక్షల తో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ వెల్దుర్తి : వెల్దుర్తి మండలం గోవర్ధనగిరి సచివాలయం -1,2 పరిధిలోని చెర్లకొత్తూరు గ్రామాలలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పాల్గొని గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కలసి పార్టీ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం చెర్లకొత్తూరు గ్రామంలో గడప-గడపకు మన ప్రభుత్వం నిధుల క్రింద మంజూరు అయిన  17లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను అధికారులు గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, జెడ్పీటీసీ,వైస్ ఎంపిపి, సర్పంచ్,వెల్దుర్తి మండలం,వైఎస్ఆర్ పార్టీ నాయకులు గోవర్ధనగిరి,చెర్లకొత్తూరు గ్రామాల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author