నెక్ట్స్.. ద ఢిల్లీ ఫైల్స్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన తదుపరి చిత్రంపై ప్రకటన చేశారు. ‘ద ఢిల్లీ ఫైల్స్’ పేరుతో కొత్త సినిమా తెరకెక్కించబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ద కశ్మీర్ ఫైల్స్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఈ సినిమా అనేక చర్చలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో వివేక్ తదుపరి చిత్రంపై అంచనాలు ఎక్కువయ్యా యి. ద ఢిల్లీ ఫైల్స్ అని టైటిల్ ప్రకటించిన ఆయన ఏ అంశంపై సినిమా ఉంటుందనేది ప్రస్తావించలేదు. అయితే, 2019 పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరి-మార్చిలో హిందువులు, ముస్లింల మధ్య ఢిల్లీలో జరిగిన ఘర్షణలపైనే సినిమా తీస్తున్నారని చర్చ జరుగుతోంది.