అభివృద్ధికి మారుపేరు మంత్రి బుగ్గన …
1 min readప్యాపిలి పట్టణంలో అభివృద్ధికి ముందడుగు
7 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన మంత్రి బుగ్గన
16 కోట్లతో ఆర్ఎంబి రోడ్డు నిర్మాణం
67 లక్షలతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం
30 లక్షలతో షాది ఖానా నిర్మాణం
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : ప్యాపిలి పట్టణాన్ని అభివృద్ధి పనులను ముందడుగుతో నిర్మాణ పనులు పూర్తి చేయించి ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పిస్తూ ప్రజల పక్షపాతిగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 16కోట్లతో ఆర్ఎంపీ రోడ్డు రోడ్డును ప్రారంభించి ,సుమారు 7 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశారు. ఆయనకు వైసిపి నాయకులు కార్యకర్తలు మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని షాది ఖానా మరమ్మత్తుల నిర్మాణం కోసం 30 లక్షలు మంజూరు చేసి షాది ఖానా నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని 67లక్షలతో ఆర్టీసీ బస్టాండ్ ను ప్రారంభించారు. ప్రజల సమస్యలపై అభివృద్ధి పనులకు ముందుంటానని ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ ,ప్రజల వారిదిగా నిలుస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శ్రీరాంరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గడ్డం భూనేశ్వర రెడ్డి, సింగల్ విండో అధ్యక్షుడు బోరెడ్డి రామచంద్రారెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి ,వైసీపీ నాయకులు బో రెడ్డి పుల్లారెడ్డి, జంగం చంద్రశేఖర్, మాజీ జెడ్పిటిసి దిలీప్ చక్రవర్తి, డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజనారాయణమూర్తి, వైసిపి నాయకులు రాజా మురళీకృష్ణ ,గండికోట చిన్న రామంజి, పొతుదొడ్డి కృష్ణమూర్తి , బోరెడ్డి కృష్ణారెడ్డి, బోరెడ్డి రఘునాథ్ రెడ్డి ,బోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సోమశేఖర్,గాజుల నరసింహులు, షాషా,పాండురంగడు, అంజి, కోటయ్య, నిజాం,రామ కృష్ణ తదితరులు వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.