NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాత్రిపూట క‌ర్ఫ్యూ.. ప‌గ‌టిపూట ర్యాలీలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుత‌న్నాయి. మ‌రోవైపు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయ ర్యాలీలు నిరాటంకంగా కొన‌సాగుతున్నాయి. దీని పై బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శించారు. రాత్రిపూట క‌ర్ఫ్యూ విధించి.. ప‌గ‌టిపూట ర్యాలీలు చేప‌డుతున్నారంటూ ప‌రోక్షంగా బీజేపీ పై విమ‌ర్శ‌లు కురిపించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను దృష్టిలో ఉంచుకోవాల‌ని అన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోవ‌డ‌మా ?.. లేక ఎన్నిక‌ల ప్ర‌చార శ‌క్తిని ప్ర‌ద‌ర్శించ‌డ‌మా ?.. రెండింటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో నిజాయితీగా నిర్ణ‌యించుకోవాల‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు చేశారు.

            

About Author