NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నైట్ క‌ర్ఫ్యూ.. వీటికి మిన‌హాయింపు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌రోన క‌ట్ట‌డి నేప‌థ్యంలో ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ విధించారు. సోమవారం నుంచి క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి వ‌చ్చింది. రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ కొన‌సాగుతోంది. అయితే.. క‌ర్ఫ్యూ నుంచి కొన్నింటికి మిన‌హాయింపునిస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఆస్పత్రులు, ఫార్మసీ దుకాణాలు, పత్రిక, ప్రసార మాధ్యమాలు, టెలీ కమ్యూనికేషన్లు, ఐటీ సేవలు, విద్యుత్ సేవలు, పెట్రోల్ స్టేషన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు నైట్ కర్ఫ్యూ నుంచి మింహాయింపు ఇచ్చారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించాలని, వాణిజ్య దుకాణాలు, మాల్స్ తదితర వాటిల్లో కోవిడ్ మార్గదర్శకాలు పాటించక పోతే రూ.10 వేల నుంచి 25 వేల వరకు జరిమానా విధించాలని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

                                          

About Author