నిండుకుండలా శ్రీశైలం.. గేట్లు ఎత్తివేత
1 min readపల్లెవెలుగువెబ్ : భారీ వర్షాలతో కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతోంది. నదిపై ఉన్న జలాశయాలు నిండు కుండల్లా మారాయి. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు జలాశయాల్లోని నీటిని కిందికి వదులుతున్నారు. శ్రీశైలం డ్యామ్ కు 1,66,599 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 7 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు ఔట్ ఫ్లో 2,53,260గా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులుగా ఉంది. కుడి, ఎడుమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.