PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిత్యానంద‌లీల‌.. శివుణ్ణి చూపిస్తాడ‌ట !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: నిత్యానంద స్వామి గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. స్వామి వారి లీల‌లు అన్ని ఇన్ని కాదు. ఆయ‌న ఒక్కో ప్రక‌ట‌న ఒక్కో సంచ‌ల‌నం. ఇటీవ‌ల త‌న స‌రిహ‌ద్దులు లేని దేశంలో శివుణ్ణి చూపిస్తానంటూ ప్రక‌ట‌న చేశారు. ఇప్పుడు ఆ ప్రక‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. కైలాస దేశానికి వ‌స్తే మూడు రోజుల్లో శివుణ్ణి చూపిస్తార‌ట‌. భార‌త్ నుంచి కైలాస రావాలంటే కైలాస వెబ్ సైట్ ద్వార పేరు న‌మోదు చేసుకోవాల‌ట‌. కేవ‌లం మూడు రోజులు మాత్రమే త‌మ దేశంలో ఉండేందుకు అనుమ‌తి ఇస్తార‌ట‌. ఈ ప్రక‌ట‌న వెలువ‌రించిన కొన్ని రోజుల‌కే.. భార‌త్ నుంచి త‌న దేశానికి రాక‌పోక‌లు నిషేధిస్తున్నట్టు ప్రక‌టించారు. భార‌త్ లో క‌రోన సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో స్వామి వారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నార‌ట‌.

About Author