NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘నిత్యానంద‌’ లీల‌లు..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నారు. భార‌త్ లో క‌రోన కేసులు విజృంభిస్తున్న వేళ‌… భార‌త్ నుంచి కైలాస దేశానికి రాక‌పోక‌లు నిషేధించారు. భార‌త్ తో పాటు బ్రెజిల్, మాలేషియా, యూర‌ప్ దేశాల మీద‌ కూడ నిషేధం విధించారు. కైలాసియ‌న్లు ఈ దేశ రాయ‌బార కార్యాల‌యాల‌తో సంబంధం ఉన్న వాలంటీర్లు క్వారంటైన్ లో ఉండాలని ఒక ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. భార‌త్ నుంచి పారిపోయిన నిత్యానంద స్వామి తాజా ప్రక‌ట‌న‌తో నెటిజ‌న్లు నిత్యానంద స్వామి లీల‌లు ఆప‌త‌ర‌మా? అంటూ న‌వ్వుకుంటున్నారు. ప్రస్తుతం నిత్యానంద స్వామి ఈక్వెడార్ లో ఒక ద్వీపాన్ని కొని.. దానికి కైలాస దేశంగా పేరుపెట్టారు. ఆ దేశానికి ప్రత్యేక క‌రెన్సీ కూడ ఏర్పాటుచేసుకున్నారు.

About Author