నైట్రోఫోన్ 1.. భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : పెగాసెస్ స్పైవేర్ వ్యవహారం పార్లమెంట్ ను కుదిపేసింది. ఐఫోన్లు కూడ సురక్షితం కాదన్న విషయం వెల్లడైంది. హ్యాకర్లు ఐఫోన్లను కూడ వదలడంలేదన్న సంగతి పెగాసెస్ వ్యవహారంతో అర్థమైంది. దీంతో ఈ భూమ్మీద సురక్షితమైన ఫోన్లు లేవా అన్న సందేహం అందరిలో మొదలైంది. అందుకు సమాధానమే నైట్రోఫోన్ 1
. ఈ భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్. దీనిని ఎవరూ హ్యాక్ చేయలేరు. ఈ ఫోన్ తయారీలో గూగుల్ పిక్సెల్ 4ఏలోని హార్డ్ వేర్ పార్ట్ తీసివేసి ఇతర హార్డ్ వేర్ తో రీప్లేస్ చేశారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ కు బదులు గ్రాఫ్రేనియన్ ఓఎస్ తో నడుస్తుంది.
నైట్రో ఫోన్ 1 లో గూగుల్ యాప్స్ రావు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఫోటోస్ వంటి యాప్స్ కు యాక్సిస్ ఉండదు. ఆన్ లైన్ లో సురక్షితమైన బ్రౌజింగ్ కోసం అత్యంత శక్తివంతమైన వెర్షన్ క్రోమియం బ్రౌజర్ తో నడుస్తుంది. నెట్రో ఫోన్ 1 ధర సుమారు 54,629 రూపాయలు.