కరోన ఎక్స్ఈ స్ట్రెయిన్ పై ఎన్.కే. అరోరా ఏమన్నారంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఒమిక్రాన్ ఎక్స్‌ఈ స్ట్రెయిన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ చీఫ్ డాక్టర్ ఎన్‌కే అరోరా కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా ఆయన ఓ వీడియోలో మాట్లాడుతూ.. కొత్త వేరియంట్ల పట్ల భయపడాల్సిన అవసరంలేదన్నారు. ఎక్స్‌ఈ తరహాలో మరిన్ని వేరియంట్లు వస్తాయన్నారు. కానీ, వైరస్ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, దేశంలో ఒకేసారి భారీగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో కొత్త వేరియంట్ పట్ల ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.