PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు వైద్య కళాశాలను NMC వైద్య బృందం తనిఖీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అడిషనల్ డీఎంఈ సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూNMC వైద్యబృందo కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మరియు కర్నూలు వైద్య కళాశాలలోని పలు విభాగాలలో వైద్య బృందo తనిఖీ చేసినట్లు తెలిపారు.కొత్త మెడికల్ సీట్లు అనుమతి మంజూరు చేయడానికి మరియు అదనంగా పిజి మెడికల్ సీట్లు కొరకు ఇన్స్పెక్షన్ నిర్వహించారు.నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి వైద్య బృందం పలు విభాగాలను తనిఖీ చేసి అనంతరం పలు విభాగాల వైద్యుల గురించి ఆరా తీశారు.ఈరోజు ఆసుపత్రి మరియు వైద్య కళాశాలకు ఎన్ఎంసి వైద్య బృందం 14 విభాగాలలో తనిఖీ నిర్వహించల్సి ఉండగా కేవలం 12 విభాగాలైన 1.అనిస్తీసియా,2.ENT, 3.ఆర్థోపెడిక్, 4.పల్మనాలజీ , 5.గైనిక్, 6.గ్యాస్ట్రో ఎండోక్రైనాలజీ 7. ఎండోక్రైనాలజీ, 8.న్యూరాలజీ, 9.ఫోరెన్సిక్, 10.పెథాలజీ, 11.మైక్రో బయాలజీ, 12.ఫార్మాకాలజి లలో తనఖీ పూర్తిచేశారు.మిగిలిన 2 విభాగాలైన పీడియాట్రిక్ మరియు సైకియాట్రిక్ డిపార్ట్మెంట్లలో ఇన్స్పెక్షన్ త్వరలో జరగనున్నట్లు తెలిపారు.1ఎండోక్రైనాలజీ, మరియు న్యూరాలజీ డిపార్ట్మెంట్లలో కొత్తగా పీజీ సీట్లు కొరకు ఇన్స్పెక్షన్ జరిగింది.ఆసుపత్రిలో మరియు వైద్య కళాశాలలో పిజి సీట్ల వలన విద్యార్థులకు మరియు పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడునున్నట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, వివిధ విభాగాల HODS, మరియు ఫోరెన్సిక్ HOD, డా.సాయి సుధీర్, ఆసుపత్రి డిప్యూటీ CSRMO, డా.హేమానలిని, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, డా.కిరణ్ కుమార్, NMC వైద్య బృందం మరియు ఇతర వైద్యులు తదితరులు పాల్గొన్నట్లు, అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్, డా.నరేంద్రనాథ్ రెడ్డి, గారు తెలిపారు.

About Author