ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదు !
1 min read
పల్లెవెలుగువెబ్ : రాష్ట్రంలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 2024లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్లకు పార్టీ రంగులను వేయడాన్ని మంత్రి సమర్థించారు. పత్రికలలో టిడ్కో ఇళ్లపై నిరాధారమైన వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. రాష్ట్ర ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారన్నారు. ఇలాంటి విమర్శలకు ప్రజలే సమాధానం చెప్తారని ఆయన పేర్కొన్నారు.