రసాయనిక ఎరువులు వద్దు.. జీవా మృత ఎరువులు ముద్దు
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: రసాయనిక ఎరువులు వద్దు.. జీవామృత ఎరువులు ముద్దు అని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. ఏడవ విడత పొలంబడిలో భాగంగా మండలంలోని బొల్లవరం గ్రామంలో ఘన, ద్రవ జీవామృతం ఎరువులు తయారు చేసే విధానాన్ని జెడ్పియన్ఎఫ్ ఆధ్వర్యంలో రైతులకు తెలియజేశారు 10 కేజీల ఆవు పేడ , 1 లీ ఆవు మూత్రం, ఒక కేజీ బెల్లం, ఒక కేజీ పప్పు దినుసుల పొడి 200 లీటర్ల నీరు ఒక డ్రమ్ములో పోసి కలియబెట్టి నాలుగు రోజులు అనంతరం వరి పొలంలో ఉపయోగించగా పంటకు ఉపయోగపడే భూమిలో ఉండే సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది పంట ఎదుగుదలకు ఉపయోగపడతాయన్నారు. పంట దిగుబడి కూడా పెరగడంతోపాటు బహిరంగ విపనిలో సేంద్రియ ఎరువుల ద్వారా పండిన పంటకు అధిక రేటు రైతులకు వచ్చే అవకాశం ఉంది అన్నారు. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ఖర్చు తగ్గి ఆదాయం పెరగడంతోపాటు భూమి కూడా సారవంతమై పంటల అభివృద్ధికి ఉపయోగపడుతుంది అని తెలిపారు. రసాయనిక ఎరువులు ఉపయోగించడం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు భూమి మరియు వాతావరణ కాలుష్యం ఏర్పడి రానున్న రోజు వీటి ప్రభావం పంటలపై పడి ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు. మానవులపై కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుందని రైతులకు తెలియజేశారు. రైతు సోదరులు దీనిని గుర్తించి సేంద్రియ ఎరువుల వైపు ముగ్గు చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీఎన్ఎఫ్ ఏఈఓ శ్రీనివాసరెడ్డి గ్రామ వ్యవసాయ శాఖ అధికారి చంద్రశేఖర్ గ్రామ రైతులు పాల్గొన్నారు.