PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కమలాపురం రైతులపై కరుణ లేదా.?? 

1 min read

కమలాపురం ప్రజా సేవకుడు సాయినాథ్ శర్మ ఆవేదన 

ఈనెల 20వ తేదీన చెన్నూరులో _రైతులతో, రైతు కూలీలతో నిరసన ప్రదర్శన

పల్లెవెలుగు వెబ్ కమలాపురం:  నియోజకవర్గ రైతాంగం పట్ల అటు పాలకులు, ఇటు నాయకులు కరుణ చూపకపోవడం చాలా దయనీయమని”” కమలాపురం నియోజకవర్గ ప్రజాసేవకుడు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి “కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ” ఆవేదన వ్యక్తం చేశారు””. కమలాపురంలోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా “ఆరు మండలాలలో కరువు పరిస్థితులు విలయతాండవం” చేస్తున్న ఎవరికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. పంటల సాగు కోసం “అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు కనీసం ఆ పెట్టుబడికి వడ్డీ కూడా రాక కొట్టుమిట్టాడుతున్నప్పటికీ” రైతు పరిస్థితుల గురించి ప్రశ్నించే నాథుడు లేకపోవడంతో “నియోజకవర్గ రైతాంగానికి తీరని అన్యాయం” జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కడప జిల్లాలో గతంలో “మరో కోస్తా ప్రాంతంగా వెలిగిన చెన్నూరు మండలం” ప్రస్తుతం” కరువు రక్కసి కోరల్లో” చిక్కు కొని” ఎడారి ప్రాంతాన్ని” తలపిస్తోందన్నారు, చెన్నూరు మండల రైతాంగానికి “ప్రధాన* *జలా ధారమైన కేసీ కెనాల్ ” కు నీటిని సక్రమంగా వదలకపోవడంతో గత రెండు ,మూడు సంవత్సరాలుగా పంటలు సాగు చేయలేక” కేసీ కెనాల్ ఆయకట్టు బీడుగా ” మారిందన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా కేసీ కెనాల్ కింద “ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తూ అక్టోబర్ 12 వ తారీఖున నీటిని విడుదల చేయడంతో ఆ నీటిని నమ్ముకున్న కొందరు రైతాంగం అక్కడక్కడ పంటలు సాగు చేసారని అయితే డిసెంబర్ 15వ తారీఖున కేసీ కెనాల్ కు నీటిని నిలిపివేస్తామని ” సంబంధిత అధికారులు ముందస్తు ప్రకటనలు చేయడం రైతులను నట్టేట ముంచినట్టు కాదా? అని ఆయన ప్రశ్నించారు.. ఏ భూముల్లో అయినా ఆరుతడి పంటలు సాగు చేయాలన్నా కనీసం నాలుగు నెలలైనా నీటి సరఫరా ఉండాలని ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా* *కేవలం రెండు నెలలు మాత్రమే నీటిని సరఫరా చేసి తూతూమంత్రంగా అధికారులు చేతులు దులుపుకోవడం చూస్తుంటే రైతుల సంక్షేమం పట్ల అధికారులకు నాయకులకు ఎంత శ్రద్ధ ఉందో అర్థం అవుతోందన్నారు. అలాగే “మండలానికి ప్రధాన జలా ధారమైన కొండపేట చెరువుకు మీరు కూడా 25శాతం ” కంటే ఎక్కువ రాలేదని దీనివల్ల చెరువు ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో పాటు బోర్లలో ఫిల్టర్లలో కూడా నీటిమట్టం ఆశించిన స్థాయిలో పెరగలేదన్నారు. రైతాంగం పరిస్థితి పంటలు లేక ఇబ్బందులు పడుతుండగా “రైతుల ను నమ్ముకున్నటువంటి రైతు కూలీల పరిస్థితి కూడా చాలా దారుణంగా ” తయారైందన్నారు . “కెసి కెనాల్ కు నీటిని ఫిబ్రవరి చివరి వరకు” సరఫరా చేయాలన్నారు కేసీ కెనాల్ కింద భూములు బీడుగా* *పెట్టిన” రైతులకు ప్రత్యేక పరిహార ప్యాకేజీ” ఇవ్వాలన్నారు అలాగే రైతు కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం “ప్రత్యేక ప్యాకేజీ “ప్రకటించాలని డిమాండ్ చేసారు. చెన్నూరు” షుగర్ ఫ్యాక్టరీ మూతపడిన “కారణంగా నష్టపోయిన ఫ్యాక్టరీ ఉద్యోగులకు తగిన “పరిహారం తగిన సమయంలోఅందించలేక పోవడంతో” ఫ్యాక్టరీ లో పని చేసిన ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల మీద ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఒప్పించుకొని పరిహార ప్యాకేజీకి ఒప్పించారన్నారు. షుగర్ ఫ్యాక్టరీలో పని చేసిన దినసరి వేతన ఉద్యోగులకు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పనిచేసిన వారికి* *కేవలం ఇరవై వేల రూపాయల మొత్తంతో సరిపెట్టడంతో “దినసరి కూలీల పరిస్థితి “సైతం ఆగమ్య గోచరంగా మారిందన్నారు. అంతేగాక కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే” ఫ్యాక్టరీ స్క్రాప్ ను సైతం కేవలం తొమ్మిది కోట్ల రూపాయలకు వేలం వేయడంతో ప్రజాధనం భారీగా దుర్వినియోగమయిందని దుయ్యబట్టారు”. షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసిన “227 ఎకరాలను అక్కడ పనిచేసిన దినసరి వేతన ఉద్యోగులకు వ్యవసాయసాగు కోసం పట్టాలివ్వాలని “కోరారు అలా కాకుంటే “పారిశ్రామిక సెజ్ “గా ఏర్పాటు చేస్తే అక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమల్లో స్థానికంగా ఉన్న “దినసరి వేతన ఉద్యోగులకు కానీ వారి వారసులకు గాని ఉపాధి అవకాశం “కల్పించాలన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు కరువు మన వైపు “అధికారుల ,నాయకుల నిర్లక్ష్యంతో రైతులకు తీరని అన్యాయం” జరిగి ఇబ్బందులు పడుతున్న “చెన్నూరు మండలాన్ని కరువు మండలంగా” ప్రకటించాలని కోరుతూ “”తాము 20వ తేదీన రైతులతో రైతు కూలీలతో కలసి ఆందోళన కార్యక్రమం”” నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి #రైతాంగం సంపూర్ణ మద్దతు ప్రకటించాలని రైతులు, రైతు కూలీలు భారీగా హాజరు* *కావాలని ఆయన కోరారు#. విలేకరుల సమావేశంలో కమలాపురం నియోజకవర్గ రైతు సంఘం నాయకుడు కల్లూరు జనార్దన్ రెడ్డి చెన్నూరు మండలం రైతు నాయకుడు జనార్దన్ రెడ్డి నియోజకవర్గ యువ నాయకుడు అమర్ నాథ్ రెడ్డి పాల్గొన్నారు.

About Author