NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్సీ కుల ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం తగదు   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: మాధాసి,మాధారి కురువలకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం తగదని ఆ సంఘం నాయకులు అన్నారు. రాయలసీమ కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసి మునిస్వామిని ఏమ్మిగనూరు కురువ సంఘం మండల నాయకులు గురువారం కలుసుకున్నారు.ఆయన జన్మదినం సందర్భంగా  రాయలసీమ  మదారి, మదాసి కురువ సంఘం సంక్షేమం కోసం పటుపడటం పట్ల అభినందనలు తెలిపారు. మధారి,మధాసి కురువ ధృవీకరణ పత్రాల జారీలో జరుగుతున్న జాప్యం గురించి వారు ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు.ఎస్సీ కుల ధృవీకరణ పత్రాల కోసం కురువ లందరూ కలిసికట్టుగా ఉద్యమించాల్సిన అవసరం ఏ ర్పడిందని వారు అభిప్రపడ్డారు.భవిష్యత్ లో సంఘం అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకునతామన్నారు.ఈ కార్యక్రమంలో మదాసి, మదారి కురువ సంఘం ఏమ్మిగానూరు మండల అధ్యక్షులు వెంకన్న, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author