తాగునీరు లేవు..రోడ్లు లేవు..
1 min readఅభివృద్ధి జాడే లేదు…
- ఊరు బాగుండాలంటే… ఎమ్మెల్యే మారాలి
- కూటమి ఆదోని అసెంబ్లీ అభ్యర్థి డా. పార్థసారధి
- విరుపాపురం, హొన్నూరులో విస్తృత ప్రచారం చేసిన కూటమి నేతలు
ఆదోని, పల్లెవెలుగు:పదైదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి… గ్రామాల అభివృద్ధి పూర్తిగా మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ఆదోని అసెంబ్లీ అభ్యర్థి డా. పార్థసారధి. గ్రామాల్లో తాగునీరు లేవు…. రోడ్లు, వీధిలైట్లు లేవు… ఎలా బతుకుతున్నారని ఆశ్చర్యపోతున్నానన్నారు. బుధవారం ఉదయం మండలంలోని విరుపాపురం,హొన్నూరు గ్రామాల్లో కూటమి నేతలు విస్తృత ప్రచారం చేశారు. కూటమి నేతలకు ఆయా గ్రామాల ప్రజలు గజమాల వేసి..ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభ్యర్థి డా. పార్థసారధి మాట్లాడుతూ పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న సాయిప్రసాద్ రెడ్డి… గ్రామీణ ప్రాంతాల గురించి పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యేగా సాయి ప్రసాద్ రెడ్డి అనర్హుడని, ఇక సాగనంపాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను తామే చేస్తున్నట్లు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకోవడం ఎంత వరకు న్యాయమన్నారు. తనను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఆదోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు మాట్లాడారు. కార్యక్రమంలో గుడిసె కృష్ణమ్మ, జనసేన నాయకులు మల్లప్ప, మదిరె భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.