మాస్క్ ధరించకపోతే ‘నో ఎంట్రీ : జేసీ
1 min readపల్లెవెలుగు వెబ్ ; తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జేసి ప్రభాకర్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ కావడంతో కరోనా కట్టడిపై ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా పరీక్షలు… పాజిటివ్ వచ్చినవారికి వైద్య సహాయం… కరోనా వ్యాక్సిన్ పంపిణీ.. వ్యాధి రాకుండా ముందస్తు చర్యలు… తదితర విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. మునిసిపల్ అధికారులు, అధికారులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పని చేయడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని ఈ సదస్సులో జెసి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.. అందరూ మాస్కులు ధరించేలా ప్రజలలో చైతన్యం తేవాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.మాస్కులు లేకుంటే తనను ఎవరూ కలవడానికి వీలు లేదని అభిమానులకు, ప్రజలకు తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.