PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫాస్ట్ ఫుడ్లు వద్దు- చిరుధాన్యాలే ముద్దు -చిరుధాన్యాలలో అధిక పోషకాలు

1 min read

– వీటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి, జాతీయ చిరుధాన్యాల దినోత్సవం లో

– ప్రాంతీయ ఉప సంచాలకులు- పద్మజ
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చిరుధాన్యాలలో అధిక పోషకాలు ఉండడంవల్ల వీటిని గర్భవతులు,, బాలింతలు తీసుకున్నట్లయితే రక్తహీనత తగ్గి ఆరోగ్యవంతులుగా ఉంటారని, చిరుధాన్యాలపై అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రాంతీయ ఉపసంచాలకు( ఆర్ జె డి) పద్మజ అన్నారు, చిరుధాన్యాలు- పోషణ పక్వాడ లో భాగంగా శనివారం స్త్రీ శక్తి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు చిరుధాన్యాల గురించి, అలాగే వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు, నేటి ఆహార విషయంలో ప్రజలు అనేక ఫాస్ట్ ఫుడ్ అలవాట్లకు లోనవుతున్నారని దీని ద్వారా ఆరోగ్యం దెబ్బ తినడమే కాకుండా, కొన్ని కొన్ని సార్లు ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం జరుగుతుందని ఆమె అన్నారు, ఫాస్ట్ ఫుడ్లు వద్దు- చిరుధాన్యాలు ముద్దు అని ఆమె తెలిపారు, ఎంపీడీవో సురేష్ బాబు, పిహెచ్సి వైద్యాధికారి వంశీకృష్ణ లు మాట్లాడుతూ, చిరుధాన్యాలలో పోషకాలు అధికంగా ఉంటాయని వీటిని తీసుకోవడం ద్వారా గర్భవతులు రక్తహీనతకు గురి కాకుండా పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యవంతంగా ఉండడం జరుగుతుందన్నారు, అలాగే మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జీయన్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ లు మాట్లాడుతూ, గర్భవతులు, బాలింతలు పోషకాహార లోపంతో ఎవరు కూడా మరణించకుండా పూర్తి ఆరోగ్యవంతంగా ఉండేందుకు అన్ని విధాల ప్రభుత్వం వారికి సంపూర్ణ పోషకాహారాలు అందించడం జరుగుతుందని, ఇందులో భాగంగా అంగన్వాడి కేంద్రాల ద్వారా వారికి, జొన్న పిండి, రాగి పిండి, ఇవ్వడమే కాకుండా అంగన్వాడి కేంద్రాలలోనే పోషకాహారం అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు,చిరుధాన్యాల ద్వారా మంచి పోషకాలు లభించడమే కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటారని , కాబట్టి ప్రజలు చిరుధాన్యాల వాడకం వంటకం గురించి తెలుసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి రమాదేవి, సిడిపిఓ ప్రభావతి, ఏపిఎం గంగాధర్, అంగన్వాడి సూపర్వైజర్ లు గురమ్మ, నాగరత్నమ్మ , అంగన్వాడి కార్యకర్తలు, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు.

About Author