ఉచిత విద్యుత్ వద్దు.. ఎమ్మెల్యేనే కావాలన్న యువతి !
1 min readపల్లెవెలుగు వెబ్: ఉచిత వద్దు .. ఆప్ ఎమ్మెల్యేనే కావాలన్న యువతికి ఎమ్మెల్యే రాఘవ్ చద్దా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పంజాబ్ లో ఉచిత విద్యుత్ కావాలంటే ఆప్ కు ఓటేయాలన్న ఓ యువకుడి కామెంట్ కు.. ఓ యువతి కొంటెగా స్పందించారు. తనకు ఉచిత విద్యుత్ వద్దని.. ఎమ్మెల్యే రాఘవ్ చద్దా కావాలంటూ ట్విటర్ట్ లో కామెంట్ చేశారు. దీనిపై ఎమ్మెల్యే రాఘవ్ చద్దా కూడ స్పందించారు. మా పార్టీ మేనిఫెస్టోలో కేవలం ఉచిత విద్యుత్ ఉంది. నేను లేను. పంజాబ్ లో ఆప్ అధికారంలోకి వస్తే మీ ఇంటికి నిరంతరం ఉచిత విద్యుత్ అందేలా చూస్తా
అంటూ సమాధానం ఇచ్చారు.