PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్యారంటీ పెన్షన్ స్కీం వద్దు .. ఏపీటీఎఫ్ నిరసన..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లో సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్. మహబూబ్ బాషా, ఏ. నాగన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం గడివేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో గ్యారెంటీ పెన్షన్ స్కీమును వ్యతిరేకిస్తూ ఏపీటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం  ఏర్పడి నాలుగున్నర సంవత్సరాలు పూర్తయినప్పటికి  ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోగా, ఉపాధ్యాయులు, ఉద్యోగులు వద్దంటున్న రాష్ట్ర ప్రభుత్వం మొండిగా సిపిఎస్  కన్నా ప్రమాదకరమైన జిపిఎస్ కు బుధవారము రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్యగా వారు అభివర్ణించారు. గ్యారెంటీ పెన్షన్ స్కీములో ఉపాధ్యాయ, ఉద్యోగుల పెన్షన్ కు ఎలాంటి గ్యారెంటీ లేదని, సిపిఎస్, జిపిఎస్ పథకాలు ఓ పి ఎస్ కు ప్రత్యామ్నాయం కాదని, పాత పెన్షన్ విధానాన్ని తప్ప తాము దేనికి అంగీకరించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. సిపిఎస్ ను వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పి, వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు మోసం చేశారని ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదని వారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము జిపిఎస్ ఆమోదమును ఉపసంహరించుకుని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగులు ఏకమై వచ్చే సాధారణ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని వారు ప్రభుత్వం హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి ఆవుల మునిస్వామి, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మానపాటి రవి , ఎల్. బాలస్వామి, సీనియర్ నాయకులు లక్ష్మణ్ కుమార్, వెంకటేశ్వర్లు మస్తాన్ సాహెబ్ సుధాకర్ రెడ్డి, స్వర్ణకుమారి, రేణుకాదేవి, మాతృనాయక్, షఫిక్ అహ్మద్, మహబూబాషా, షమీనా, షహీన్ పాల్గొన్నారు. పిడి అసోసియేషన్ నాయకులు భుజంగరావు, ఆర్ యు పి పి నాయకులు రామకృష్ణ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపారు.

సీపిఎస్​, ఓట్లు, సీఎం, పథకాలు,

About Author