PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బడ్జెట్ లో హల్వా లేదు !

1 min read

పల్లెవెలుగువెబ్ : కేంద్ర బడ్జెట్ కు ముందు ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుకను నిర్వహించడం సంప్రదాయం. కరోన కారణంగా ఈ వేడుకను ఆర్థిక శాఖ పక్కనపెట్టింది. హల్వా బదులుగా స్వీట్లు ఇవ్వనుంది. బడ్జెట్ రూపకల్పన పూర్తయిన తర్వాత లాక్ ఇన్ లో ఉండే సిబ్బందికి చివరి రోజు మిఠాయిలు పంచనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఒక ప్రకటన చేసింది. ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలోని బేస్ మెంట్ లో గల ప్రింటింగ్ ప్రెస్ లో బడ్జెట్ పత్రాల ముద్రణ చేపడతారు. సాధారణంగా ఏటా ఈ పత్రాల ముద్రణకు ముందు భారతీయ వంటకమైన హల్వాను వండుతారు. ఆర్థిక మంత్రి సమక్షంలో దీనిని సిబ్బందికి పంచుతారు.

         

About Author