కాంట్రాక్టు ఉద్యోగి పై అనుచిత వాఖ్యలు చేయలేదు: కౌన్సిలర్ జాకీర్ హుసేన్
1 min readపల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: నందికొట్కూరు పురపాలక సంఘంలో కాంట్రాక్టు ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న రాంబాబు పట్ల అనుచిత వాక్యలు చేయలేదని పురపాలక సంఘం 2వ వార్డు కౌన్సిలర్ మొల్ల. జాకిర్ హుసేన్ అన్నారు. ఆదివారం పట్టణంలో రబ్బానీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబరు 30న చైర్మన్ దాసీ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పురపాలక సాదరణ సమావేశలో కాంట్రాక్ట్ ఉద్యోగి రాంబాబు ఏ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారో తెలియజేయాలని మాత్రమే మున్సిపల్ DE నరేష్ ను అడిగాను. ఈ విషయమై కమిషనర్ అంకిరెడ్డిని అడగాలని సూచించారు. అనంతరం పట్టణంలోని పలు సమస్యలపై చర్చించాం. అంతేకానీ రాంబాబును కులం పేరతో దూషించలేదన్నారు. పట్టణ సమస్య పరిష్కారం కోసం కార్మికులు, అధికారులతో సమన్వయంగా పని చేయడమే తన లక్ష్యమన్నారు. ఆ తరువాత దళిత సంఘం నాయకులు మాట్లాడుతూ కౌన్సిలర్ జాకీర్ దళిత మాల మాదిగలతో సోదరభావంతో ఉంటారని, దళితమగిళ అన్నానుపాటి ప్రాంతం లో చెన్నామ్మ మృతి చెందితే 10000/ రూపాయలు ఆర్థిక విషయం అందించారని గుర్తు చేశారు. సమావేశంలో వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ, మా బాష, రియాజ్ ముజీబ్, * మైనార్టీ నాయకులు రహంతుల్లా, రఫీ, చాంద్ బాష, 4ep కార్యకర్తలు మోగన్, శ్రీనివాసులు, రమధనాయుడు, కరీముల్లా, ఇద్రాక్ష రజ, రైతుసంఘం నాయకులు చిన్నబాబు, ముత్తు, మాసుకు రహంతుల్లా, Be నాయకులు, జనారన్ నాయుడు, దళిత నాయకులు స్వాములు, రాజు, వెంకటేశ్వర్లు, శేషన్న తదితరులు ఉన్నారు.