PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లాక్ డౌన్ ఆలోచ‌న లేదు: కేంద్రం

1 min read

ఢిల్లీ: దేశంలో 45 ఏళ్లు నిండిన వారంద‌రికి క‌రోన వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు తెలిపారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జ‌వ‌డేక‌ర్. ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రక్రియ మొద‌లుపెడుత‌న్నట్టు తెలిపారు. ఢిల్లీలో విలేక‌రుల స‌మావేశంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జ‌వ‌డేక‌ర్ ఈ మేర‌కు ప్రక‌ట‌న చేశారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ వేగ‌వంతంగా జ‌రుగుతోంద‌ని.. వ్యాక్సిన్ కొర‌త లేద‌ని తెలిపారు. వ్యాక్సిన్ విష‌యంలో ఎలాంటి అపోహ‌ల‌కు తావులేద‌న్నారు. ఇప్పటికే 4.85 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నార‌ని తెలిపారు.
లాక్ డౌన్ ఆలోచ‌న లేదు.
క‌రోనా కేసులు విజృంభిస్తున్న నేప‌థ్యంలో మ‌రోసారి లాక్ డౌన్ విధించే అవ‌కాశం ఉందా? అన్న విలేక‌రులు ప్రశ్నకు ఆయ‌న స‌మాధాన‌మిచ్చారు. కేంద్రం మ‌రోసారి లాక్ డౌన్ విధించే ఆలోచ‌న చేయ‌డం లేద‌ని తెలిపారు. క‌రోన కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో రాష్ర్ట ప్రభుత్వాలు అప్రమ‌త్తంగా ఉండాల‌ని.. కేసుల క‌ట్టడికి చ‌ర్యలు తీసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

About Author