ఆదోని ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి – జలమయమైన మంత్రాలయం, నందవరంలో పర్యటించిన అధికారులు పల్లెవెలుగు వెబ్, ఆదోని : ఆదోని డివిజన్లో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు, చెరువుల్లో నీరు ఉప్పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలు, పంటలు నీటమునిగాయి. మంత్రాలయం, నందవరంలో ఇళ్లల్లోకి నీరు దూసుకెళ్లాయి. జలమయమైన ప్రాంతాలను ఆదోని ఆర్డివో ప్రభాకర్ రెడ్డి మంత్రాలయం, నందవరం మండలాల్లో పర్యటించారు. వర్షానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు తక్షణమే పునరావాసం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదోని, డివిజన్, మునిసిపల్, మండల స్థాయి అధికారులందరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి సూచించారు.