భూ సమస్య విషయంలో ఎలాంటి అవకతవకులు జరపలేదు
1 min readతహసిల్దారు హుస్సేన్ సాబ్, ఆర్ ఐ ధినోజ్ రాజశేఖరన్
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : మండలకేంద్రంలోని సర్వే నంబరు 511/%దీ%1 నందలి ఒక ఎకరా 22 సెంట్లు భూమి విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని మండల తాసిల్దారు హుస్సేన్ సాహెబ్ ఆర దినోజ్ రాజశేఖరన్ లు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కొందరు మండల కేంద్రంలోని సర్వే నంబర్ 511/%దీ%1 లోని భూమి విషయంలో అదే గ్రామానికి చెందిన కొంతమంది వాట్అప్ లలో అధికారులు తారుమారు చేశారంటూ వస్తున్న కథనాలు అవాస్తవమని, ఇందుకు ఆ సర్వే నంబరు కు చెందిన భూమి యజమానులు గా లద్దే సుమ తమ కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక తహసిల్దారు కార్యాలయంలో తహసిల్దారు సిబ్బంది చేత ఆ భూమికి సంబంధించిన పత్రాలను సమర్పించి దానిపై వస్తున్న అవాస్తవ ఘటనలను కొట్టిపారేయాలంటూ తాసిల్దార్ కు కోరారు. దీంతో తాసిల్దార్ హుస్సేన్ సాబ్ ఆర్ఐ ధినోజ్కుమార్ లు ఆ భూమి మరియు సర్వే నంబరు పై ఉన్న వాస్తవ పత్రాలన్నింటినీ పరిశీలించామని పరిశీలించినపిమ్మటే లతే సుమకు మా భూమి తన అత్తగారైన మహంకాలమ్మ ద్వారా తమకు సంక్రమించినదని వారు తెలపగా ఆర్ ఓఆర్ అడంగలు మరియు పాత పసిలి సంబరు మరియు యజమానులు అందించిన రిజిస్టర్ పత్రాలను పరిశీలించే వారి పేరిట ఆన్లైన్ అడంగల్ ను ఎక్కించటంజరిగిందని అంతేకాకుండా ఆ భూమి పై గతం లో కోర్టులో నుండి ఇంజక్షన్ ఆర్డరు కూడా వచ్చిందని దాని ఆధారంగా చేసుకుని లద్దే సుమకు ఆ భూమిని ఆన్లైన్ వన్ బి అడంగలు ఎక్కించటం జరిగిందని ఆ తదనంతరం భూ యజమాని లద్దే సుమ మా భూమిని ఇతరులకు అమ్మకం జరిపారని రిజిస్టర్ ద్వారా చూద్దాం ఆ భూమి పై ఈ మౌలా సాబ్ కొనుగోలు ద్వారా యజమాని గా ఉన్నారని తాసిల్దారు కార్యాలయ సిబ్బంది వివరించారు. తాసిల్దారు కార్యాలయం ద్వారా తమపై వస్తున్న అవాస్తవ సంఘటనలను తాసిల్దారు హుస్సేన్ సాబ్ ఆర ధినోజ్ కుమార్ లు తోసిపుచ్చారు. అలాగే సబ్ కలెక్టర్ ద్వారా వచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్లను సైతం వారు చూయించటం జరిగిందని ప్రస్తుతం ఆ భూమి యజమానులు అమ్మకాలు జరిపిన మౌలా సాబ్ అని తెలిపారు. దీంతో వాట్సాప్ ద్వారా వస్తున్న కథనాలన్నీ అవాస్తవమైనవని వాటిని ఎవరు నమ్మరాదని తెలిపారు.