ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. విక్రమార్కుడిలా పాదయాత్ర
1 min read– వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించుకుంటేనే గ్రామాలు అభివృద్ధి మిడుతూరు ఎత్తిపోతల పథకానికి లోకేష్ హామీ:గౌరు -పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్న టిడిపి శ్రేణులు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ఎన్ని అడ్డంకులు సృష్టించినా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర విక్రమార్కుడిలా కొనసాగుతోందని నారా లోకేష్ మొదట పాదయాత్ర చేపట్టిన సమయంలో ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారని వాటన్నింటినీ టిడిపి కార్యకర్తలు బలంగా ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారని గత టిడిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల వారికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని ఈ వైసీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల కాలంలో అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించడం లేదంటూ పాదయాత్ర అనంతరం మిడుతూరు ఆటో స్టాండ్ దగ్గర జరిగిన ప్రజలను ఉద్దేశించి నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి ప్రభుత్వంపై విరుచుకుబడ్డారు.అంతేకాకుండా యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా మన గ్రామాలను మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో టిడిపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు అంతే కాకుండా నందికొట్కూరులో పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన మిడుతూరు మండలానికి ఎత్తిపోతల పథకాన్ని తీసుకురావడానికి మనకు హామీ ఇచ్చారని ఆయన అన్నారు.తాగు సాగునీటిలో పొలాలను అభివృద్ధి చేసుకొనుటకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని గౌరు వెంకటరెడ్డి అన్నారు.నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటికి 100 రోజులు పూర్తి కావడంతో లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా నందికొట్కూరు నియోజకవర్గంలో సోమవారం ఉదయం 9 గంటలకు కడుమూరు నుండి మిడుతూరు వరకు చేపట్టిన పాదయాత్ర టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి మరియు మండల నాయకులు వంగాల శివరామిరెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా సాగింది. ముందుగా కడుమూరులో గ్రామ నాయకులు గౌరు వెంకట రెడ్డికి పూల బొకేలు అందజేస్తూ టపాకాయలు కాలుస్తూ ఘన స్వాగతం పలికారు.కడుమూరులో సెంటర్లో దేవాలయం దగ్గర తెలుగుదేశం పార్టీ జెండాను గౌరు వెంకటరెడ్డి ఆవిష్కరించారు.ఈ పాదయాత్రలో జెండాలను చేత పట్టుకొని చిన్నారులు మహిళలు మరియు పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, జయసూర్య వివిధ గ్రామాల నాయకులు సంపంగి రవీంద్రబాబు,రమణారెడ్డి,మొల్ల చాకర్ వలి,సర్వోత్తం రెడ్డి,మనోహర్ రెడ్డి,సోఫీ సాహెబ్,రమణారెడ్డి, మిడుతూరు సుభాన్,ఐటిడిపి మండల అధ్యక్షుడు ఇంతియాజ్,మైనారిటీ సంఘం నంద్యాల జిల్లా కార్యదర్శి సుల్తాన్ మరియు కడుమూరు గ్రామ టిడిపి నాయకులు ఇద్రీస్,సుధాకర్ రెడ్డి,జఫ్రూల్లా,మగ్బుల్ మరియు వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.