ఎంత హోదా ఉన్నా.. గుడిలోకి రానివ్వడం లేదు !
1 min read
పల్లెవెలుగువెబ్ : కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి పరమేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘విదేశాలలో చదివాను. అత్యున్నతమైన డాక్టరేట్ పొందాను. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగానూ పని చేశాను. అయినా ఇప్పటికీ నన్ను ఆలయాల్లోకి అనుమతించకపోవడం విచారకరం’ అని కాంగ్రెస్ సీనియర్ నేత పరమేశ్వర్ వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని కొరటగెరెలో గురువారం వివిధ ప్రభుత్వ శాఖలు నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు ‘కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశా. రాష్ట్రంలో అత్యున్నతమైన పదవులు నిర్వహించా. ఇప్పటికీ పూజల కోసం నేను ఆలయాలకు వెళితే, అర్చకులే బయటకు వచ్చి మంగళహారతి ఇస్తారు. దేశంలో ఇలాంటి దయనీయ పరిస్థితి ఇంకా కొనసాగడం మా దురదృష్టం’ అని అన్నారు.