NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎయిర్ పోర్టులో క‌నీస వ‌స‌తులు లేవు: రాజ‌మౌళి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఢిల్లీ ఎయిర్ పోర్టులో క‌నీస వ‌స‌తులు క‌ల్పించ‌క‌పోవ‌డం పై ప్రముఖ ద‌ర్శకుడు రాజ‌మౌళి పెద‌వి విరిచారు. ఎయిర్ పోర్ట్ ని ట్యాగ్ చేసి.. ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈ విష‌యం పై ఎయిర్ పోర్ట్ అధికారులు స్పందించారు. ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు రాజ‌మౌళికి ఎయిర్ పోర్ట్ అధికారులు ధ‌న్యవాదాలు తెలిపారు. ప్రయాణీకుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ఆర్టీపీసీఆర్ వివ‌రాలు నింపేందుకు అవ‌స‌ర‌మైన డెస్క్ లు ఉన్నాయ‌ని, అవ‌స‌ర‌మైన‌వి మ‌రికొన్ని ఏర్పాటు చేస్తామ‌ని అన్నారు. ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాజ‌మౌళి.. ఆర్టీపీసీఆర్ వివరాలు నింపేందుకు స‌రైన డెస్క్ లేద‌ని అస‌హ‌నం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ నేప‌థ్యంలో విమానాశ్రయ అధికారులు స్పందించారు.

About Author