NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సోష‌ల్ మీడియాకి ఇక దూరం : కొర‌టాల శివ‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సోష‌ల్ మీడియాకు ఇక నుంచి స్వస్తి ప‌లుకుతున్నట్టు ప్రముఖ ద‌ర్శకుడు కొర‌టాల శివ తెలిపారు. త‌న ట్విట్టర్ అకౌంట్ ద్వార ఈ విష‌యాన్ని ప్రక‌టించారు. ఇక నుంచి మీడియా మిత్రుల ద్వార అభిమానులు, ప్రజ‌ల‌తో అందుబాటులో ఉంటాన‌ని తెలిపారు. త‌న అభిప్రాయాలు పంచుకునే వేదిక మారింది కానీ.. మ‌న మ‌ధ్య ఉన్న అనుబంధం కాదంటూ అభిమానుల్ని ఉద్దేశించి కొర‌టాల శివ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇప్పటి వ‌ర‌కు ఎన్నో సినీ, సామాజిక అంశాలు ప్రజ‌ల‌తో పంచుకున్నానని తెలిపారు. కొర‌టాల శివ సోషల్ మీడియాకి ఎందుకు దూరం అవుతున్నార‌న్న విష‌యాన్ని స్పష్టంగా ప్రక‌టించ‌లేదు. ప్రస్తుతం చిరంజీవి న‌టిస్తున్న ఆచార్య సినిమాకి కొర‌టా శివ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు.

About Author