మూర్ఛపై అపోహాలు వద్దు : డా.నిషాంత్ రెడ్డి
1 min read– రేపు అంతర్జాతీయ ఎపిలెప్పీ (మూర్ఛ) దినోత్సవం
– డాక్టర్. నిషాంత్ రెడ్డి , కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ , కిమ్స్ హాస్పిటల్స్, కర్నూలు
పల్లెవెలుగు వెబ్: ఫిట్స్‌పై ఇప్పటికీ ప్రజల్లో అపోహలున్నాయి. వీటితో బాధపడేవారిని అన్ని పనులకు దూరంగా ఉంచుతారు. వారిని ప్రత్యేక దృష్టితో చూస్తారు. వైద్య విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. ఫిట్స్ నియంత్రణకు ఎన్నో మందులు అందుబాటులో ఉన్నాయి. ఫిట్స్‌ను గుర్తించడమే కీలకం. తర్వాత చికిత్స చేస్తే మెరుగైన ఫలితాలుంటాయి. మందులతో తగ్గని ఫిట్స్‌కు సర్జరీ, ఫేస్‌మేకర్‌తో తగ్గించే వీలుంది. ఫిట్స్‌తో బాధపడుతున్న పురుషులైనా. స్త్రీలైనా పెళ్లీల్లు చేసుకోవచ్చు. మందులు వాడితే కంట్రోల్ ఉంటుంది. గర్భిణిగా ఉన్నప్పుడు ఫిట్స్ మందులు వాడొచ్చు. దీని వల్ల తల్లికీ, బిడ్డకు ప్రమాదం ఉండదు.
ఫిట్స్ సర్జరీ గురించి తెలుసుకుందాం
మూర్ఛ(ఎపిలెప్సీ/ఫిట్స్) 1000 మందిలో నలుగురికి ఉంటుంది. ఇది ఏ వయుసులోనైన రావచ్చు. చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు రావచ్చు. కానీ చాలా సాధారణంగా ఇది రెండేళ్ల వయసులోపు, ఆ తర్వాత 50, 60 ఏళ్లు పైబడిన వారిలో వస్తుంది. మధ్య వయసులో రావడం తక్కువే. మూర్ఛ మొదలైన తర్వాత వీరిలో నియంత్రణ లేకపోవడం వల్ల దీర్ఘకాల ఎపిలెప్సీతో ఏళ్లతరబడి బాధపడుతుంటారు.
ఎలా వస్తుంది
మొదడులోని ఒక బాగంలో అవసరానికి మించి విద్యుత్‌శక్తి ఉత్పత్తి అవడం వల్ల ఫిట్స్ వస్తాయి. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్ ఏ భాగం నుంచి ఎక్కడికి వస్తుంది దాన్ని బట్టి రోగికి లక్షణాలు మొదలవుతాయి. ప్రసవం కష్టమైనప్పుడు శిశువల్లో ఒక్కోసారి పుట్టినప్పుడు మొదడులో రక్తసరఫరా తక్కువైనప్పుడు ఫిట్స్ వస్తాయి. పిల్లల్లో ఫిట్స్‌ను గుర్తిస్తే వెంటనే చికిత్స చేసి తగ్గించే వీలుంది. అందుకని ఆసుపత్రుల్లోనే డెలవరీ చేయించుకోవాలి.
పిల్లల్లో.. ఫిట్స్ ప్రభావం..
మెదడు ఎదుగుదలలో లోపానికి ఇంకో కారణం. కొంత మందిలో ఒక భాగంలో లేదా రెండు నుంచి మూడు మిల్లీ మీటర్లు లేదా సెంటీమీటర్ భాగంలో ఫిట్స్ ఉండొచ్చు. కొన్నిసార్లు మొదడు అర్ధ భాగం లేదా మొత్తం మొదడులో అసాధరణ పరిస్థితి ఉండొచ్చు. పిల్లల్లో వచ్చే నియంత్రించలేని ఫిట్స్‌కు ఇదొక కారణం. ఈ సమస్య ఉన్న 100 మందిలో 70 మందికి మందులతో తగ్గదు.
జన్యుపరంగా…30శాతం..
ఇక పెద్దవారిలో ఫిట్స్‌కు కారణం మొదడులోని కణితలు. క్యాన్సర్ కణుతులకు వీటికి తేడా ఉంటుంది. దీని వల్ల కాళ్లు, చేతులు పడిపోవడం జరగదు. కణుతులు ఒక చోట ఉండడం వల్ల ఫిట్స్ వస్తుంటాయి. కానీ రోగికి ఎలాంటి సమస్యలుండవు. జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. కుటుంబంలో ఎవరికైన ఫిట్స్ ఉంటే వారి తర్వాత తరానికి 30 నుంచి 40 శాతం ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది.
చిన్నప్పుడు జ్వరంతో ఫిట్స్ వస్తాయి. మధ్యలో ఫిట్స్ రావు. మళ్లీ 10, 112 ఏళ్లప్పుడు ఫిట్స్ వస్తాయి. రెండోసారి ఫిట్స్ మొదలైన తర్వాత సంవత్సరాల తరబడి ఉంటాయి. మందులు వాడినా నియంత్రణలో ఉండవు. 20 ఏళ్లు 30 ఏళ్లయినా ఫిట్స్ వస్తుంటాయి. అందుకని మొదటి రెండు సంవత్సరాల్లోనే ఫిట్స్ వచ్చినప్పుడు మందులతో నిమంత్రించాలి. అప్పటికీ తగ్గకపోతే సర్జరీ చేయడమే పరిష్కారం.
లక్షణాలు
ఎవరైనా కాళ్లు, చేతులు కొట్టుకుంటేనే, కిందపడిపోతేనే వారు ఫిట్స్‌తో బాధపడుతున్నారని అనుకుంటాం. ఇలా అందరికీ జరగదు. ఫిట్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే… ఉన్నట్లుండి చేస్తున్న పని ఆపి 20 నుంచి 30 సెకన్లు బొమ్మాలా ఉంటారు. ఈ సమయంలో వీరిని పలకరించినా మాట్లాడరు. ఏమైందని అడిగితే నాకేంమైందని ఎదరు ప్రశ్న వేస్తారు. ఏమీ గుర్తుండదు. మనం గమణించాల్సిందే. ఆ సమయంలో వీరు చేతులు నలపడం, మింగినట్లు చేయడం, మూతి చప్పరించడం చేస్తుంటారు. చూసే వారికి ఎందుకిలా చేస్తుంటారు అని అనుకుంటారు. కానీ ఫిట్స్ అని తెలుసుకోలేరు. ఇలా అస్తమానం చేస్తుంటే ఫిట్స్ అని అర్థమవుతుంది. ఈ క్రమంలో కాళ్లు, చేతులు కొట్టుకుంటారు. ఇది ఫిట్స్ సంబంధించేమోనని భావించి వైద్యున్ని సంప్రదించాలి.
ఆబ్‌సైన్స్ ఫిట్స్:
చేస్తున్న పనిని ఆపేసి సడేన్‌గా ఉండిపోవడం. నాలుగేళ్ల నుంచి 10 ఏళ్ల వయసు పిల్లల్లో ఇది సాధారణం. స్కూల్‌లో టీచర్ చెబుతుంటే పిల్లలు రాస్తూంటారు. ఆకస్మాత్తుగా రాయం ఆపేస్తారు. 10, 15 సెకన్లు ఆపేసి మళ్లీ రాయడం మొదలుపెడుతారు. టీచర్ పాఠం చెప్పేటప్పడు వింటూనే సడెన్‌గా ఆగిపోతారు. మళ్లీ తేరుకుంటారు. పాఠం మద్యలో మిస్ అవుతారు. టీవీ చూస్తునప్పుడు కూడా ఇలాగే అవుతుంది. ఇలా రోజుకు 20 నుంచి 30 సార్లు ఒక్కోసారి వందసార్లు కూడా అవుతుంది. మందులతో బాగా తగ్గుతుంది. 11 ఏళ్ల తర్వాత మందులు అవసరం ఉండదు. కానీ టెంపరల్ లోబో ఎపిలెప్సీ మందులతో తగ్గే అవకాశం తక్కువ. ఉన్నట్టుండి ఉలికిపడుతారు. చేతుల్లో వస్తువులు పడేస్తారు.
నిర్థారణ:
ఫిట్స్ వచ్చిన వారికి చాలా మంది ఇఇజి పరీక్ష చేస్తారు. ఇఇజిలో మొదడుపై వైర్లు పెట్టి కంప్యూటర్ ద్వారా రికార్డ్ చేస్తారు. అసాధారణ విద్యుత్ శక్తి ఏ భాగం నుంచి వస్తుందో కనుక్కుంటారు. ఆ తర్వాత మొదడు స్కానింగ్ చేస్తారు. సిటి స్కాన్‌లో ఏం తెలియదు. ఎందుకంటే ఫిట్స్ వచ్చే కారణం మిల్లీమీటర్లలో ఉంటుంది. అందుకని ఎంఆర్ఐ (మాగ్నటిక్ రెసినెన్స్ ఇమేజింగ్) స్కాన్ తప్పనిసరి ఫిట్స్ రోగులందరికీ చేసే ఎంఆర్ఐ చేయకూడదు. దీనికి ఎపిలెప్సీ ప్రోటోకాల్ పాటించాలి. ఫిట్స్‌కు తగ్గ ఎంఆర్ఐ చేయాలి. దీన్నిబట్టి ఏ రకమైన ఫిట్స్ తీవ్రతను గుర్తిస్తారు.
చికిత్స:
వంద మంది ఫిట్స్ రోగులకు మందులతో చికిత్స చేస్తే 60 మందికి తగ్గుతుంది. అంటే మందులతో ఫిట్స్ నియంత్రణలో ఉంటుంది. చాలా మంది ఫిట్స్‌కు మూడేళ్లు, ఐదేళ్లు మందులు వాడితే, పెళ్లయితే ఇక తగ్గిపోతుంది అనే అపోహతో ఉంటారు. వందలో 10, 15 శాతం రోగుల్లో ఐదారేళ్లు మందులు వాడితే తగ్గించి ఆపేసే అవకాశముంటుంది. మిగితావారు జీవితాంతం మందులు వాడాల్సిందే. మందులు ఎందుకంటే ఫిట్స్ నుంచి రక్షణ కోసమని గుర్తించాలి. బయట రోడ్డు మీద నడుస్తునప్పుడు, వంట చేస్తునప్పుడు, ఇతర ప్రదేశాల్లో పని ప్రాంతాల్లో ఫిట్స్ వచ్చినప్పుడు కలిగే ప్రమాదాన్ని నివారించడం. ఫిట్స్ తగ్గించడం మందుల ముఖ్య ఉద్దేశ్యం. ఐదేళ్ల తర్వాత ఫిట్స్ కంట్రోల్‌లో ఉంటే మందుల మోతాదును తగ్గిస్తారు. పూర్తిగా ఆపడం ఉండదు. 60 మందికి మందులతో, 40 మందికి శస్త్రచికిత్స చేయాలి.
సర్జరీ అంటే టీం వర్క్:
సర్జరీ రకాలు: ఎపిలెప్సీ మూడు, నాలుగు రకాలుంటాయి. 80శాతం కేసుల్లో టెంపరల్ లోబో ఎపిలెప్సీ చేస్తారు. వీరిలో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాలు చేసుకోవచ్చు. పెళ్లిళ్లు చేసుకోవచచు. పిల్లల్ని కనవచ్చు.
- లీజనెక్టమీ : బ్రెయిన్‌లో ఎక్కడా తేడా ఉంది తెలుసుకొని కార్డికల్ స్టిమ్యులేషన్ చేసి తీసేస్తారు.
- హెమిస్పరెక్టమీ: చిన్నప్పటి నుంచి కాళ్లు చేతులు బలహీనంగా ఉండి, ఫిట్స్ వస్తుంటే ఆపరేషన్ చేస్తారు.
- పేస్‌మేకర్: గుండె జబ్బు ఉన్నవారికి ఫేస్‌మేకర్ అమర్చినట్లుగానే ఫిట్స్ రోగులకు కూడా పేస్‌మేకర్‌తో చికిత్స చేస్తారు.