మంకీపాక్స్ పై ఆందోళన అక్కర్లేదు !
1 min readపల్లెవెలుగువెబ్ : మంకీపాక్స్ వైరస్ కేసుల పెరుగుదలపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రపంచ ప్రఖ్యాత హెచ్ఐవీ నిపుణుడు డాక్టర్ ఈశ్వర్ గిలాడా అన్నారు. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. వైరస్ మహమ్మారి అవుతుందని ఎవరూ చెప్పలేరన్నారు. ఇండియాలో ఎయిడ్స్-కంట్రోల్ పై డాక్టర్ గిలాడా విస్తృత కృషి చేశారు. ఇండియాలో ఇంతవరకూ ఎలాంటి మంకీపాక్స్ కేసులు నమోదు కానప్పటికీ బ్రిటన్, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, స్వీడన్, కెనడా, అమెరికాలో కేసులు నమోదయ్యాయి. కొత్తగా ఆస్ట్రేలియాలో రెండు కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్ గురించి డాక్టర్ గిలాడ మరింత వివరిస్తూ, హెచ్ఐవీ తరహాలోనే ఇది జూనోటిక్ వ్యాధి అని అన్నారు. ”ఇలాంటి వైరస్‌లు జంతువుల్లో వ్యాప్తి చెంది, మనుషులకు విస్తరించే అవకాశం ఉంటుంది. గత 40 ఏళ్లగా చూసిన అన్ని ఇన్‌ఫెక్షన్లు వైరస్‌లే” అని చెప్పారు. వైరస్ మ్యుటేటింగ్ అవుతున్నందున దీనికి సమర్ధవంతమైన యాంటీ-వైరల్ ప్రస్తుతానికి అందుబాటులో లేదని తెలిపారు.