PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్ని శక్తులు ఏకమైన ప్రజా బలమున్న జగన్ను ఓడించలేరు

1 min read

అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి 

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం  .వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని శక్తులు ఏకమై పోటీ చేసిన ప్రజాబలం ఉన్న  మా నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి  వస్తుందని. బనగానపల్లె శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డిఅవుకు మండలం కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి   ధీమా వ్యక్తం చేశారు.  బనగానపల్లె పట్టణంలో పల్లె వెలుగు న్యూస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడమే గాక, ఇవ్వని హామీలను కూడా అమలుచేశారనిప్రశంసించారు . నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని వారు తెలిపారు. అందుకే ప్రజల మధ్యకు తాము ధైర్యంగావెళ్లగలుగుతున్నామన్నారు . గత తెలుగుదేశం పాలనలో పచ్చ చొక్కాల వారికే సంక్షేమ పథకాలు  అందించి అర్హులైన పేదలకు తీరని అన్యాయం చేశారని వారు ఆరోపించారు. జన్మభూమి  కమిటీల పేరుతో  ప్రజలను తెలుగుదేశం నాయకులు మోసం చేశారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో పార్టీలకు,  వర్గాలకు, కుల మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని వారు తెలిపారు . జగన్ జనరంజక పాలన  చేస్తున్నారని వారు కొనియాడారు.  తెలుగుదేశం పాలనలో ప్రజలకు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని కనీసం రైతు రుణాల మాఫీ చేయలేకపోయారని  వారు ధ్వజమెత్తారు . రైతులపై చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందోదీనినిబట్టిఅర్థమవుతుందని  ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతన్నల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడమే గాక రైతు భరోసా ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ పంటలు దెబ్బతిన్నప్పుడు వెంటనే నష్టపరిహారం అందిస్తూ రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నారని వారు తెలిపారు . ప్రజా బలమున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వచ్చే శాసనసభ ఎన్నికల్లో  ఓడించడం చేతగాక తెలుగుదేశం పార్టీ ఇతరుల సహాయం  పొందుతున్నదని వారు ఆరోపించారు. ఆ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే జగనన్నను   ఒక్క పార్టీయే ఎదుర్కోవాలని కోరారు. తెలుగుదేశం  పార్టీ ఎన్ని కుట్రలు పన్నాగాలు చేసిన  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించలేదని వారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న విధంగా తమ పార్టీ 175 కు  175   సీట్లను ప్రజల ఆశీస్సులతో గెలుచుకొని అధికారంలోకి వస్తామని వారు తెలిపారు  .

About Author