PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్బీఎల్ బ్యాంకు డిపాజిట్ల‌కు ఎలాంటి ఇబ్బంది లేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్బీఎల్ బ్యాంకు డిపాజిట్ల‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. మూలధనం, స్వల్పకాలిక చెల్లింపులకు అవసరమైన నిధులపరంగా చూసినా బ్యాంక్‌ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉందని పేర్కొంది. డిపాజిటర్లు, ఇతర భాగస్వాములకు ప్రయోజనాలకూ ఎలాంటి ఢోకా లేదని తెలిపింది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ విశ్వవీర్‌ అహూజా సెలవుపై వెళ్లడం, ఆ స్థానంలో రాజీవ్‌ అహూజాను నియమించడంతో బ్యాంకులో ఏదో జరుగుతోందనే వార్త లు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ ప్రకటన విడుదల చేయడం గ‌మ‌నార్హం.

                             

About Author