NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్ షర్మిల పార్టీ పెట్టినా ఇబ్బంది లేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ సోద‌రి, వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ఏపీలో రాజ‌కీయ పార్టీ పెడ‌తార‌న్న ఊహాగాలు వెలువ‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏపీ మంత్రి బొత్స సత్య‌నారాయ‌ణ స్పందించారు. రాష్ట్రంలో వైఎస్‌ షర్మిల పార్టీ పెట్టినా తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇక్కడ ఉన్న పది పార్టీల్లో అది కూడా ఒకటిగా మిగిలిపోతుందన్నారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని, ఇకపై రాజకీయ చిత్రపటంలో చంద్రబాబు పేరు ఉండదన్నారు. కుప్పంలో స్థానిక ఎన్నికల ఓటమిపై ప్రతిపక్షనేత ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. నాలుగు రోజులుగా చంద్రబాబు చేస్తున్న పర్యటనలో ఆయన ఆవేదన చూస్తున్నామని, సీఎం జగన్‌పై, తమ పార్టీపై విమర్శలు చేయడం తప్ప మరొకటి లేదన్నారు.

                                           

About Author