NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హెచ్ఆర్ఏ పై స్పష్ట‌త రాలేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హెచ్ఆర్ఏ పై ప్ర‌భుత్వం నుంచి స్ప‌ష్ట‌త రాలేద‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు బొప్ప‌రాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసులు పేర్కొన్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఇచ్చిన హెచ్ఆర్ఏ స్లాబుల‌ను కేంద్ర ప్ర‌భుత్వ స్లాబుల‌తో పోల్చ‌డం స‌రికాద‌న్నారు. దీని వ‌ల్ల స‌చివాల‌య హెచ్వోడీ ఉద్యోగులు 22 శాతం, జిల్లా కేంద్రంలోని ఉద్యోగులు 12 శాతం, మున్సిపాలిటీల్లోని ఉద్యోగులు 6.5 శాతం, మండ‌ల కేంద్రాల్లోని ఉద్యోగులు 4.5 శాతం హెచ్ఆర్ఏ కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని తెలిపారు. హెచ్ఆర్ఏ త‌గ్గించొద్ద‌ని ప్ర‌భుత్వాన్ని మ‌రోసారి కోరిన‌ట్టు ఉద్యోగ సంఘాల నేత‌లు చెప్పారు. సీఎంతో మ‌రోసారి చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అధికారులు చెప్పిన‌ట్టు ఉద్యోగ సంఘాల నేత‌లు తెలిపారు.

                                         

About Author