PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులకు మద్దతు ధర చెల్లించదు..

1 min read

పూర్తి ధాన్యం కొనుగోలు చేయదు..
– ఏపీ ప్రభుత్వంపై హరీష్​బాబు ఫైర్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: “రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించదు.. పూర్తి ధాన్యం కొనుగోలు చేయదు.. ఇదీ సీఎం జగన్​ రెడ్డి ప్రభుత్వ వైఖరి ’’.. అంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమలాపురం పార్లమెంట్ ఇంచార్జ్ కర్నూలు హిందూ టైగర్ కగ్గోలు హరీష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రైతుల కష్టాలు.. కన్నీళ్లుగా మార్చిన సీఎం జగన్​ రెడ్డిపై ఆయన తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. వ్యవసాయ బిందు సేద్యం పరికరాల కోసం కేంద్ర ప్రభుత్వం నా బార్డు కింద రూ.1028 కోట్లు నిధులు కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపిస్తూ.. మంగళవారం బీజేపీ నాయకులు మండలంలోని గొందిపర్లలోని ఓ రైతు పంట పొలంలో నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా హిందూ టైగర్ కగ్గోలు హరీష్ బాబు మాట్లాడుతూ 2020​–21 పంట కాలంలో రైతులు 60 లక్షల టన్నుల ధాన్యం పండిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం 45 లక్షల టన్నులు మాత్రమే లక్ష్యంగా పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అందులోనూ 22 లక్షల ధాన్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సేకరించడం దారుణమన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను… కొనుగోలు సమయంలో కొర్రీలు పెడుతూ .. సాకులు చూపుతూ.. రైతుల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. ఇప్పటికైనా రైతుల నుంచి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పూర్తి ధాన్యం కొనుగోలు చేయాలని హరీష్​బాబు డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు హేమలత రెడ్డి , డా.నాగేంద్ర వీక్కీ వెంకటేష్ , గోపాల్ వేల్పుల, ప్రవీణ్ యాదవ్ , PGR గణేష్ , సూర్య కుమార్ , నవీన్ , సాయి చరణ్ సింగ్, తేజారాం, బాలాజీ సింగ్ , రాహుల్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author