టైంపాస్ విధులు వద్దు ప్రతి ఒక్కటి లబ్ధిదారులకు చేరాల్సిందే
1 min read– చిన్నారులను వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు
– మిడుతూరు గడప గడపలో ఎమ్మెల్యేకు ప్రజలు బ్రహ్మరథం –
– వైసీపీ నాయకుడు రావొ ద్దంటూ ఎస్సీ కాలనీలో గొడవ
– గడప గడప బందోబస్తుకు మిడుతూరు ఎస్ఐ దూరం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: గత నాలుగు సంవత్సరాలు ఒక్కటి ఈఆరు నెలలు మరొక్కటి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయం ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నా మరియు చెడ్డ పేరు తీసుకురావాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది.మీరు చేసే ప్రతి పని ప్రజలకు మంచిగా చేస్తే ముఖ్యమంత్రి జగన్ అన్నకు మంచి పేరు(ప్లస్ అవుతుంది)వస్తుంది.మీరు టైంపాస్ గా కార్యాలయానికి వస్తూ విధులు నిర్వహిస్తూ ఇంటికి వెళ్తే ప్రజలకు పనులు చేయని పక్షంలో జగనన్నకు చెడ్డ పేరు(మైనస్ అవుతుంది)వస్తుందని నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ గడప గడప కార్యక్రమం అనంతరం అధికారులతో జరిగిన సమావేశంలో అటు మండల శాఖల అధికారులకు ఇటు సచివాలయాల సిబ్బందికి మరియు వాలంటీర్లకు ఆయన చురకలు అంటించారు.బుధవారం ఉదయం 9 గంటలకు మిడుతూరులో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం మరియు మానమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.ఎమ్మెల్యే ప్రతి ఇంటికి తిరుగుతున్న సమయంలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.ఎండనూ కూడా సైతం లెక్కచేయకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలు అడిగిన ప్రశ్నలకు దీటుగా సరైన సమాధానం ఇస్తూ పిల్లలను అటు వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా మమేకమై ఆయన ముందుకు సాగారు.మానమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమంలో భాగంగా ఇంటి యజమానులకు పలు ప్రశ్నలు వేసి వారి అనుమతితో ఎమ్మెల్యే ఇంటికి స్టిక్కర్లను అతికించారు.ప్రజలు ఇంటి స్థలాలు,ఇండ్లు మంజూరు,త్రాగునీటి సమస్య,విద్యుత్ స్తంభాలు,రోడ్లు,పింఛన్లు మరియు డ్రైనేజీ తదితర సమస్యల గురించి ప్రజలు అడగగా ఆయా శాఖలకు సంబంధించిన అధికారులను పిలిచి వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.గడపగడప కార్యక్రమం ముగిసిన అనంతరం అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించి ప్రభుత్వం ప్రజల కోసం ఏమి చేసినా కూడా ప్రతిపక్షం వారు ఏమేమో మాట్లాడుతున్నారు అధికారులు చేసే పనుల్లో చివరి వరకు సక్రమంగా చేస్తే ప్రతిపక్షాలకు దీటుగా వాటిని తిప్పి కొట్టవచ్చని ఎమ్మెల్యే అధికారులతో అన్నారు.మంగళవారం రాత్రి మిడుతూరు ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే గడప గడపలో వెళ్తూ ఉండగా చెరుకుచెర్ల రఘురామయ్య మాగ్రామానికి రావద్దంటూ కాలనీవాసులు అడ్డుకుంటూ అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.నీది వేరే గ్రామం మాగ్రామానికి నువ్వెవరు రావడానికి అంటూ రఘురామయ్యను అడ్డుకున్నారు.అక్కడ ఒకరినొకరు మాటల తూటాలు జరిగాయి.నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎస్ఐ మారుతి శంకర్ రఘురామయ్యకు చెప్పారు. ఎస్సై పై వస్తున్న ఫిర్యాదుల పట్ల జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే మరియు రఘురామయ్య ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అందుకు గాను బుధవారం ఉదయం మిడుతూరులో జరిగిన గడప గడప ఎమ్మెల్యే కార్యక్రమానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందికొట్కూరు రూరల్ సీఐ జి.సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బ్రాహ్మణ కొట్కూరు ఎస్ఐ ఓబులేష్,ముచ్చుమర్రి ఏఎస్ఐ కృష్ణుడు,జూపాడుబంగ్లా ఏఎస్సై మరియు వివిధ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది గట్టి బందోబస్తును సీఐ పర్యవేక్షించారు.మిడుతూరు ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బందిని ఈకార్యక్రమానికి దూరంగా ఎందుకు ఉంచారని పలువురు చర్చించుకుంటున్నారు.ఈకార్యక్రమంలో చెరుకుచెర్ల రఘురామయ్య,ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి,తహసిల్దార్ సిరాజుద్దీన్,ఏఈలు విశ్వనాధ్,ప్రతాప్ రెడ్డి, క్రాంతికుమార్,రమేష్,జయంతి,సుబ్బయ్య,పంచాయతీ కార్యదర్శులు సుధీర్,కేశావతి వినోద్,వివిధ గ్రామాల నాయకులు వెంకట్,పుల్లయ్య,నాగన్న,ఇ నాయతుల్ల,కాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.