NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తాగ‌డానికి నీళ్లు లేవు.. చిన్నారి మృతి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తాగునీరు లేక అయిదేళ్ల చిన్నారి మృత్యవాత‌ప‌డింది. రాజ‌స్థాన్ లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. చిన్నారితో పాటు ఉన్న వృద్ధురాలు కూడ స్పృహ త‌ప్పిప‌డిపోయింది. అయిదేళ్ల చిన్నారి, వృద్దురాలితో క‌లిసి రాయ్ పూర్ నుంచి రాణివాడ తాలూకాలోని రోడా గ్రామానికి బ‌య‌లుదేరింది. మార్గమ‌ధ్యలో దాహం వేసింది. చుట్టుప‌క్కల ఎక్కడా చుక్క నీరు కూడ దొర‌క‌క‌పోవ‌డంతో.. అలాగే ముందుకుసాగారు. మ‌రికొంత దూరం న‌డిచినా స‌రే.. నీరు దొర‌క‌లేదు. అప్పటికే విప‌రీత‌మైన దాహంతో అయిదేళ్ల చిన్నారి అల‌మ‌టిస్తోంది. చిన్నారి, వృద్ధురాలు ఇద్దరూ దాహార్తిని త‌ట్టుకోలేక స్పృహ‌త‌ప్పిప‌డిపోయారు. అదే మార్గంలో ప్రయాణిస్తున్న వారు గ‌మ‌నించి అధికారులకు స‌మాచారం ఇచ్చారు. అప్పటికే చిన్నారి మృతి చెందింది. వృద్దురాలిని అధికారులు ఆస్పత్రికి త‌ర‌లించారు.

About Author