సంచార దలిత కులానికి రిజర్వేషన్ హక్కులు కల్పించాలి…
1 min readతూర్పాటి మనోహర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ టౌన్ నందు శ్రీనివాస్ నగర్ బేడ బుడగ జంగం కాలనీ నందు ముఖ్య కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ పాల్గొని మాట్లాడుతూ:- బేడ బుడగ జంగం కులమునకు సంబంధించిన రిజర్వేషన్ సమస్య,AP క్యాబినెట్ నెంబర్:-276 /2023 date :-11-09-2023 న అలాగే అసెంబ్లీ నందు తేదీ:-25-09-2023 Do Letter No :-83 /legn /2023-5 నందు తీర్మానం చేసి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా Letter No:-7297 /SW CV/2008 తేదీ:-06-10-2023 నా ” సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ నివేదిక ” పంపడం జరిగినది.కనుక కేంద్రంలో షెడ్యూల్డ్ 2002 of 61 Act నందు జరిగిన తప్పిదాలను సవరణ చేసి, తెలంగాణ ప్రాంతానికే కాక, ఆంధ్రప్రదేశ్లోని ఈ సంచార బేడ బుడగ జంగం కమ్యూనిటీకి న్యాయం చెయ్యాలి.
చట్టాలు, జీవోలు, అనుకూలత :-
షెడ్యూలు కులాల 1976 of 108 Act నందు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రాంతీయ వ్యత్యాసం బేడ బుడగ జంగం కులమునకు చూపించలేదు. అలాగే లోకూర్ కమిషన్ (1965), శ్రీ రామచంద్ర రాజు కమిషన్(1997), ఉష మెహర కమిషన్ (2008), ఆంత్రో బయాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా census (1981) , AP హైకోర్టు WAPNo:-19083 /1994, AP సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ GOS:- 58,68 (1997), కర్నూలు జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్ ఆర్డర్ D.Dis(C6)1749/M/2002.Date:-10-09-2003. వంటి ఆధారాలతో “బుడగ జంగం SC” కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం జరిగిందని, ఆ జాతి నేత తూర్పాటి మనోహర్ తెలియజేశారు. కానీ బోగస్ కులాలు చొరబాటు జరుగుతుందన్న చిన్న కారణం చేత అప్పటి ప్రభుత్వం ఎలాంటి విచారణ చేయకుండా 1985 సంవత్సరం పంపించిన నివేదిక ప్రకారం షెడ్యూలు 2002 of 61 చట్టం నందు ప్రాంతీయ వ్యత్యాసంతో అన్యాయం చేశారు.
కనుక ఈ విషయంపై మా ఏండ్ల తరబడి పోరాటాల వలన, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ JC శర్మ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగినది. యొక్క కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి రెండు దఫాలుగా 2020 & 2019 మా జాతికి అనుకూలంగానే నివేదిక ఇవ్వడం జరిగినది. వీటి పైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక పంపి ఉన్నారు కనుక కాలయాపన చేయకుండా ఈ సంచార దళిత పీడిత కులము సమాజపరంగా కుల ఆత్మాభిమానంగా జీవించుటకే, విద్య, ఉద్యోగ, సంక్షేమ పరంగా న్యాయం చేయగలరని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా, స్థానిక నాయకులు పాల్గొన్నారు.