ఎన్నికల్లో నిరుద్యోగులంతా నామినేషన్ వేయండి !
1 min readపల్లెవెలుగు వెబ్ : నిరుద్యోగులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టిన నిరుద్యోగ నిరాహార దీక్షను ఆమె విరమించారు. అంతకుముందు ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని ఆమె తెలిపింది. హుజురాబాద్ ఉపఎన్నికలో నిరుద్యోగులంతా నామినేషన్ వేయాలని చెప్పారు. వీలైనంత ఎక్కువ మంది నామినేషన్ వేయాలని పిలుపునిచ్చారు. నామినేషన్ వేస్తే పార్టీ తరపున ఆర్థికంగా సహకరిస్తామని తెలిపారు.