NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ ఎలక్షన్ లో నామినేషన్ ధాఖలు

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: మే నెల పద్నాల్గవ తేదీన విజయవాడలో జరగనున్న ఇరవై ఆరు జిల్లాల వడ్రంగి వృత్తి పనివార్ల ఎన్నికలకు ఈ రోజు ఎన్నికల కమిటీ సభ్యులు శ్రీపల్లి సిద్ధార్ద గుణదల ఆఫీసునందు నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల పోటీ చేసేందుకు గాను డిపాజిట్ సొమ్ము వారు సూచించిన ఎకౌంటుకు ట్రాన్స్ ఫర్ చేయడం జరిగిందిఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల యం. బి. సి గౌరవ అధ్యక్షులు డా.ఆకుమళ్ళ నాని మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో వడ్రంగి వృత్తి దారులకు ఎన్నికలంటే ఇలా రాష్ట్ర స్దాయిలో జరగటమంటే ఇదీ ఒక సరి కొత్త నూతన చరిత్రకు నాంది పలికాలని రాష్ట్రంలో ప్రతి కార్పెంటర్స్ మీ అమూల్యమైన ఓటు వేసి అసోసియేషన్ బలోపేతానికి మీ వంతు సహకారం అందించి భాగస్వామ్యం వహించాలని సూచించారు నవ సమాజ నిర్మాణానికి కీలక పాత్ర పోషించే కార్పెంటర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించు కోవడం లేదు కోట్లాది రూపాయల పన్నులు కట్టే కార్పెంటర్లు చిల్లి గవ్వ కూడా ఇవ్వని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పని చేయించు కోవాలి అంటే కార్పెంటర్ అసోసియేషన్ ఎన్నికల్లో పాల్గోని అసోసియేషన్ బలమైన నాయకత్వం ద్వారా సమస్యలు పరిష్కారం అయ్యేలా ఉండాలి అంటే కార్పెంటర్ల కోసం నిరంతరం కృషి చేసే తాటికొండ.రంగ బాబు లాంటి నాయకులుని భలపర్చుకావాలని రాష్ట్ర కార్పెంటర్స్ మరియు మన యం.బి.సి.లను కూడా కోరుచున్నాననీ డా. ఆకుమళ్ళ. నాని అన్నారు.

About Author