అట్టహాసంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్లు
1 min read
పత్తికొండ , న్యూస్ నేడు: పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నిక కోసం మొదటి రోజు నామినేషన్లు అట్టహాసంగా దాఖలు అయ్యాయి. గురువారం స్థానిక జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో ఉన్న బార్ అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్ష ఎన్నిక కోసం వై. మధుబాబు, డి.బాలభాష ఎన్నికల అధికారి ఎ.మైరాముడికి ఎన్నికల నామినేషన్ పత్రాలను అందించారు. అధ్యక్ష బరిలో ఉన్న వై.మధుబాబు, ప్యానల్స్ లో ఉపాధ్యక్షుడిగా జె.రవికుమార్, జనరల్ సెక్రటరీగా జి. భాస్కర్, ట్రెజరర్ గా ఎస్. సురాజ్ నబి, లైబ్రరీ అండ్ జాయింట్ సెక్రెటరీగా ఎం.నరసరావు నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మైరాముడు మాట్లాడుతూ… పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష మరియు ప్యానల్ సభ్యుల నామినేషన్లను ఈనెల 20వ తేదీ నుండి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తామని తెలిపారు. 22వ తేదీ వచ్చిన నామినేషన్లను పరిశీలిస్తామని, 23వ తేదీ నామినేషన్లు విత్ డ్రా ఉంటాయని, 27వ తేదీ ఎన్నికలు ఉంటాయని వివరించారు. 27వ తేదీ గురువారం సాయంత్రం 4 నుండి 5 గంటల లోపు ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి నెట్టేకల్లు, న్యాయవాదులు చంద్రశేఖర్, నారాయణస్వామి, మహేష్, శ్రీనివాసరెడ్డి, ప్రసాద్ బాబు, శ్రీకాంత్ రెడ్డి, నరసింహులు వెంకటేశ్వర్లు, కబీర్ దాసు, విశ్వనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.